Breaking NewscrimeHome Page Slider

ఒక ఏఈఈ….వంద కోట్ల అక్ర‌మాస్తులు

తెలంగాణ నీటిపారుద‌ల శాఖ సస్పెన్ష‌న్ ఏఈఈ నిఖేష్ కుమార్ అక్ర‌మాస్తుల కేసులో సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌కొస్తున్నాయి. స్నేహితుడి లాకర్​లో కిలోన్నర బంగారంతో పాటు ప్లాటినం నగలు, వజ్రాభరణాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.మొత్తం 8 లాక‌ర్ల‌లో బంగారు,ప్లాటినం,వ‌జ్రాల‌ ఆభ‌ర‌ణాలు దాచిపెట్టిన‌ట్లు ద‌ర్యాప్తు అధికారులు గుర్తించారు.కాగా ఇందులో రెండు లాక‌ర్లు మాత్ర‌మే నిఖేష్ పేరుతో ఉండ‌గా మ‌రో 6 లాక‌ర్లు బంధుమిత్రుల పేర్ల‌తో ఉన్నాయి.ఇందులో ఒక లాక‌ర్‌లో కిలోన్న‌ర బంగారం ఉండ‌గా దాదాపుగా రూ.100కోట్ల‌కు పైగా స్థిర చ‌రాస్తులుంటాయయ‌ని అంచ‌నా వేస్తున్నారు.ఇత‌న్ని అరెస్ట్ చేసిన తొలిరోజే అధికారులు రూ.17.73 కోట్ల అక్ర‌మాస్తుల‌ను గుర్తించారు.నిఖేష్ కుమార్ బ్యాంకు ఖాతాలు కూడా స్థంభింప‌జేయాల‌ని ఏసిబి అధికారులు బ్యాంక‌ర్లకు లేఖ‌లు రాశారు.ఆస్తులు మొత్తం గుర్తించాలంటే క‌నీసం ఓ నెల రోజుల స‌మ‌యం ప‌ట్టేట్లుందని అధికారులు వెల్ల‌డించారు.