బీజేపీ కార్యకర్తలకు అమిత్ షా శుభాకాంక్షలు
బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కార్యకర్తలకు, నాయకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. బీజేపీని ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా మార్చే ప్రయాణంలో తమ జీవితాలను పణంగా పెట్టి అంకితం చేసిన కార్యకర్తలకు నమస్కరిస్తున్నానని అమిత్ షా ట్వీట్ చేశారు. దేశాన్ని ప్రధాని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని తెలిపారు.