రైతులతో అమిత్ షా భేటీ
కేంద్ర హోం మంత్రి అమిత్ షా బేగంపేట విమానాశ్రయంలో రైతులతో, రైతు సంఘాల నేతలతో, వ్యవసాయ రంగ నిపుణులతో చర్చలు జరిపి మునుగోడుకు హెలిక్యాప్టర్లో వెళ్లారు. స్థానిక రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఫసల్ బీమా యోజన, గిట్టుబాటు ధర, మరిన్ని పథకాలకు సంబంధించి వారికి వివరించారు. మునుగోడు లో సాయంత్రం నాలుగు గంటల నుంచి సిఆర్పిఎఫ్ ఉన్నతాధికారులతో అమిత్ షా సమావేశం అవుతారు. అనంతరం ఐదు గంటలకు మునుగోడు బహిరంగ సభలో ప్రసంగిస్తారు. మునుగోడు సభ తర్వాత అమిత్ షా తిరిగి హైదరాబాద్ కు రోడ్డు మార్గం ద్వారా వచ్చి ఈనాడు గ్రూప్ అధినేత రామోజీరావుతో సమావేశమవుతారు. అనంతరం జూనియర్ ఎన్టీఆర్తో భేటీ అవుతారు. అమిత్ షా రాకతో తెలంగాణ బీజేపీ శ్రేణుల్లో అమితోత్సాహం నెలకొంది. ఓ సామాన్య కార్యకర్త, దళిత వర్గానికి చెందిన సత్యనారాయణ ఇంటికెళ్లి టీ తాగడం అమిత్ షా నిరాడంబరతకు నిదర్శనమని బీజేపీ కార్యకర్తలు గొప్పగా చెప్పుకుంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ తో 15 నిమిషాల భేటీకి సంబంధించి అమిత్ షా కార్యాలయం నుంచి నేరుగా ఆయనకు సమాచారం అందింది..