NationalNews Alert

విధుల్లో అలసత్వం కారణంగా కేంద్రమంత్రి, క్లర్క్‌కి నేరుగా ఫోన్

ప్రభుత్వ అధికారుల పని ఎప్పుడూ కత్తి మీద సామే. ఎప్పుడైనా విధుల్లో అలక్ష్యంగా ఉంటే గట్టి దెబ్బ తినక తప్పదు. అమేధీ నియోజక వర్గంలోని తహసిల్‌లో పనిచేస్తున్న దీపక్ అనే క్లర్క్‌పై ముసఫిర్ఖానా తహసిల్‌లోని పూరే పహల్వాన్ గ్రామానికి చెందిన కరుణేశ్ అనే వ్యక్తి ఫిర్యాదు చేసాడు. తన తల్లికి పెన్షన్ మంజూరు కాకపోవడానికి దీపకే కారణమని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ దృష్టికి తీసుకుని వచ్చాడు. ఆ సమయానికి ఆమె అమేఠీ లోక్‌సభ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. వెంటనే సృందించిన ఆమె, దీపక్‌కు అక్కడ నుండే ఫోన్ చేశారు. దీపక్ ఆమె గొంతును గుర్తు పట్టలేకపోవడంతో నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు.

పక్కనే ఉన్న జిల్లా ఉన్నతాధికారి ఆ ఫోన్ తీసుకుని క్లర్క్‌తో మాట్లాడారు. వెంటనే కార్యాలయానికి రావాలని చెప్పారు. ఈ విషయంపై విచారణకు సిద్దం కావాలని, అధికారులు సృష్టం చేసారు. కరుణేశ్ ఫిర్యాదుపై క్లర్క్ నిర్లక్ష్యం వహించినట్లు ప్రాథమికంగా నిర్థారించారు. తర్వాత ఈ ఘటనపై ముసఫిర్ఖానా సబ్‌డివిజనల్ మేజిస్ట్రేట్ విచారణ జరుపుతారని తెలియజేసారు.