భారత్‌కు అమెరికా షాక్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా ఇప్పుడు ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై సుంకాల్ని రెట్టింపు చేసి 50 శాతానికి చేర్చారు. ఇది జూన్ 4 నుంచి అమల్లోకి రానుంది. ఈ నిర్ణయం భారత్‌పై తీవ్ర ప్రభావం చూపనుంది. ఏకంగా వేల కోట్ల నష్టం రానుంది. అమెరికా ప్రభుత్వం స్టీల్, అల్యూమినియం దిగుమతులపై విధించే సుంకాలను రెట్టింపు చేసింది. ఈ నిర్ణయం భారతీయ తయారీ మరియు ఎగుమతి రంగాలపై గట్టిగా ప్రభావం చూపనుంది. ఆర్థిక పరిశోధనా సంస్థ గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ (GTRI) తెలిపిన ప్రకారం, ప్రత్యేకంగా వాల్యూ యాడెడ్ స్టీల్ ఉత్పత్తులు, ఫినిష్డ్ గూడ్స్, ఆటో విడిభాగాల పరిశ్రమలు భారీగా నష్టపోవచ్చని అంచనా.

