శత్రుదేశాలకు అమెరికా సాయం చేయదు:నిక్కీ హేలీ
అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు 2024లో జరగనున్నాయి. దీంతో అధ్యక్ష బరిలో నిలిచిన అభ్యర్ధులు తమదైన శైలిలో దేశ అభ్యున్నతికి పాటుపడతామని ఎన్నో రకాల హామీలు ఇస్తున్నారు. అలాగే అమెరికా చేపడుతున్న కొన్ని కార్యకాలాపాలపై వారి అభిప్రాయాలను ట్విట్టర్ వేదికగా తెలియజేస్తున్నారు. దీనిలో భాగంగానే పాకిస్థాన్,ఇరాన్,ఇరాక్ వంటి దేశాలకు అమెరికా ఇస్తోన్న ఆర్ధిక సాయాన్ని నిలిపివేస్తామని రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్ధి,భారత సంతతి మహిళ నిక్కీ హేలీ స్పష్టం చేశారు. దీనిపై ఆమె తన ట్విట్టర్ వేదికగా స్పందించారు.

అమెరికా బలహీనంగా ఉంది కాబట్టే చెడ్డదేశాలకు కూడా నిధులు అందిస్తుంది. గత ఏడాదిలోనే పాకిస్థాన్,ఇరాన్,జింబాబ్వే వంటి దేశాలకు వందల మిలియన్లు ఇచ్చిందన్నారు. అదే అమెరికా దృఢంగా ఉంటే ప్రపంచానికి ఏటీఎంగా ఉండదన్నారు. అధ్యక్షురాలిగా తాను ఎన్నికయ్యినట్లైతే విదేశాంగ విధానంలో మార్పు తీసుకువస్తానన్నారు. మన శత్రుదేశాలకు నిధులు ఆపేందుకు ప్రణాళికలు రచిస్తామని నిక్కీ హేలీ వరుస ట్వీట్లు చేశారు. 2024లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నిక్కీ హేలీ తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. దీనిలో భాగంగానే ఆమె ఓ పత్రికకు వ్యాసం రాశారు. అందులో ఆమె అమెరికన్లు కష్టపడి సంపాదించిన డబ్బును శత్రుదేశాలకు ఇచ్చి వృథాచేసుకోమని,ప్రతి పైసాలోనూ కోత విధిస్తామని ఆమె తేల్చి చెప్పారు. విదేశీ సాయం పేరిట అమెరికా గతేడాది చైనా,పాకిస్థాన్,ఇరాక్ వంటి దేశాలకు 46 బిలియని డాలర్లు ఖర్చు చేసిందన్నారు. ఈ పరిస్థితుల్లో..అధ్యక్షురాలిగా ఎన్నికయ్యాక శత్రుదేశాలకు సాయాన్ని పూర్తిగా నిలిపివేస్తామని ఆమె ఆ వ్యాసంలో పేర్కొన్నారు. ఇండో -అమెరికన్ నిక్కీ హేలీ సౌత్ కరోలినాకు గవర్నర్‌గా,ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారిగాను సేవలందించారు. 2018 అక్టోబర్‌లో అప్పటి అధ్యక్షుడు ట్రంప్ పాలనాయంత్రాగం నుంచి బయటకువచ్చారు. ప్రస్తుతం ఆమె రిపబ్లికన్ పార్టీ నుంచి ట్రంప్‌తో పాటు అధ్యక్ష అభ్యర్ధిత్వ రేసులో ఉన్నారు.

