InternationalNews Alert

తైవాన్‌కు అమెరికా సెనేటర్‌.. చైనా వార్నింగ్‌

అమెరికా సెనేట్‌ స్పీకర్‌ నాన్సీ పెలోసీ.. తైవాన్‌ పర్యటనతో చైనా-అమెరికా మధ్య మొదలైన ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. చైనా హెచ్చరికలను బేఖాతరు చేస్తూ అమెరికా అధికారిక పర్యాటనలను కొనసాగిస్తోంది . దీంతో చైనా మరోసారి స్ట్రాగ్‌ వార్నింగ్‌ ఇచ్చింది . తాజాగా అమెరికా సెనేటర్‌ మార్షా బ్లాక్‌బర్న్ తైవాన్‌లో పర్యటించడాన్ని డ్రాగన్‌ దేశం తీవ్రంగా ఖండించింది. తైవాన్‌తో అధికారిక చర్యలను ఆపాలని హెచ్చరించింది. రిపబ్లికన్ సెనేటర్‌ మార్షా బ్లాక్‌బర్న్‌ ఈ నెల 25 నుంచి 27 వరకు తైపీలో పర్యటించారు.

ఈ పర్యటన ఒకే చైనా పాలసీ నిబంధనలను అమెరికా ఉల్లంఘిస్తోంది. చైనా భూభాగంలో తైవాన్‌ అంతర్భాగం. చైనా మొత్తానికి పీపుల్స్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ చైనా ప్రభుత్వానికే అధికారం ఉంది` అని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి హువా చున్యింగ్ స్పష్టం చేశారు . తైవాన్‌ స్వాతంత్య్రం, వేర్పాటువాదం, విదేశీ శక్తుల జోక్యాన్ని వ్యతిరేకించడంలో వెనకడుగు వేయబోమన్నారు. అలాగే తైవాన్‌తో అనధికారిక సంబంధాలు మాత్రమే కొనసాగిస్తామన్న అమెరికా.. వాగ్దానానికి ఈ పర్యటన వ్యతిరేకంగా ఉందని. ఒకే చైనా పాలసీ.. చైనా-అమెరికా ఒప్పందాలకు కట్టుబడి ఉండాలని అమెరికా రాజకీయ నేతలకు విన్నవిస్తున్నామని తెలిపారు.

ఫిజీ పర్యటన ముగించుకుని తైపీకి చేరుకున్నఅమెరికా సెనేటర్‌ మార్షా బ్లాక్‌బర్న్‌ మాట్లాడుతూ… తైవాన్‌ను ఆక్రమించుకునేందుకు చైనా వేచి చూస్తోందని ఆరోపించారు. ఫిజీ, పపువా న్యూ గనియా, తైవాన్‌లకు అమెరికా దౌత్య మద్దతును మరోస్థాయికి తీసుకెళ్లేందుకే ఈ పర్యటన సాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ పర్యటనలో తైవాన్‌ జాతీయ భద్రతా మండలి అధినేతతో సమావేశమయ్యారు.