అమెరికాకు ఆ దేశం నుండి భారీగా బంగారం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడు చర్యల ద్వారా అమెరికా ఖజానాకు భారీగా బంగారు నిల్వలు వచ్చిపడుతున్నాయి. ‘అమెరికా ఫస్ట్’ అనే నినాదంతో ఎన్నికలలో విజయం సాధించిన ట్రంప్ అమెరికా ప్రయోజనాలకే పెద్దపీట వేస్తూ అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా ట్రంప్ సుంకాల బెదిరింపుల నేపథ్యంలో లండన్‌లో బంగారం ధర భారీగా క్షీణించింది. 20 డాలర్ల మేర బంగారం ధర తగ్గిపోయింది. దీనితో బిలియన్ల డాలర్ల విలువైన బంగారం బ్రిటన్ నుండి యూఎస్‌కు చేరుకుంటోంది. ట్రంప్ అధ్యక్షుడయ్యే నాటికి అమెరికాలో ఉన్న 50 బిలియన్ల డాలర్ల బంగారు నిల్వలు, తాజాగా 160 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని సమాచారం.