అంబేద్కర్ విగ్రహం, రాజ్యాంగంపై అపచారం..ఉద్రిక్తత
మహారాష్ట్రలోని పర్భానిలో ఒక వ్యక్తి అంబేద్కర్ విగ్రహానికి, రాజ్యాంగానికి అపచారం చేశాడు. అంబేద్కర్ విగ్రహం ముందే రాజ్యాంగాన్ని చించేశాడని వివాదం చెలరేగింది. మరాఠా వర్గానికి చెందిన సోపన్ దత్తారావ్ పవార్(45) ఈ నీచానికి పాల్పడినట్లు సమాచారం. ఇలాంటి పనులు చేయడం సిగ్గుచేటని అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్ మండిపడ్డారు. ఈ నిందితుడిని ఉరి తీయాలంటూ వీబీఏ అధ్వర్యంలో ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. దీనితో ఉద్రిక్తత చెలరేగి, పరిస్థితుల్ని అదుపు చేయడానికి పోలీసుల టియర్ గ్యాస్ ప్రయోగించారు.