సీఎం నివాసానికి ఇజ్రాయెల్ రాయబారి
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి బుధవారం రాత్రి ఇజ్రాయెల్ దేశ రాయబారి రూవెన్ అజార్ వచ్చారు.సీఎంకి పుష్పగుచ్చం అందించి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. జూబిలీహిల్స్‌లోని రేవంత్ నివాసంలో జరిగిన భేటీలో పలు అంశాలు చర్చకు వచ్చాయి.పెట్టుబడులు,పర్యటనలు తదితర అంశాల గురించి చర్చించారు. తెలంగాణా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పలు సంక్షేమ పథకాలు,జరుగుతన్న అభివృద్ది కార్యక్రమాల పట్ల రాయబారి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ భేటీలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి , ఆర్పీవో స్నేహజతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.
BREAKING NEWS: అల్లు అర్జున్ పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు పవన్ కళ్యాణ్..!