BusinessHome Page SliderInternationalNews AlertTrending Today

టాప్-10 సంపన్నుల ర్యాంక్ నుండి అంబానీ ఔట్..

హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2025 ప్రకటించిన సంపన్నుల జాబితాలో భారత కుబేరుడు ముకేశ్ అంబానీ టాప్ 10 జాబితాలో స్థానం కోల్పోయారు. అయితే ఆసియాలో అత్యంత ధనవంతునిగా మాత్రం తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు. గత ఏడాది అప్పులు పెరగడంతో ఆయన సంపద రూ. 1 లక్ష కోట్లు తగ్గిపోయిందని ఈ సర్వేలో తెలిసింది. టాప్ 1లో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ 420 బిలియన్ డాలర్ల సంపదతో ఉన్నారు. 266 బిలియన్ డాలర్లతో అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్, 3 వస్థానంలో మెటా సీఈవో జుకర్ బర్గ్ కొనసాగుతున్నారు. భారత్‌లో అంబానీ కుటుంబం రూ.8.6 లక్షల కోట్లతో అగ్రస్థానంలో ఉండగా, రెండవ స్థానంలో గౌతమ్ అదానీ కుటుంబం రూ.8.4 లక్షల కోట్లతో ఉంది. విప్రో అధినేత అజీమ్ ప్రేమ్‌జీ కుటుంబం రూ.2.2 లక్షల కోట్లతో కొనసాగుతున్నారు. గత ఏడాదితో పోలిస్తే భారత్‌లో బిలియనీర్ల సంఖ్య 45 మంది పెరిగి 284కు చేరింది. ముంబయి నగరం 90 మంది బిలియనీర్లతో అగ్రస్థానంలో ఉంది.