‘డబుల్ ఇస్మార్ట్’ ఓటీటీ పార్ట్‌నర్‌గా అమెజాన్ కైవసం
రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న డబుల్ ఇస్మార్ట్ మూవీ ఓటీటీ పార్ట్‌నర్‌ను ఫిక్స్ చేసుకుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ సినిమా డిజిటల్ హక్కులను రూ.33 కోట్లకు దక్కించుకుంది. పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో కావ్యా థాపర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నారు. సంజయ్ దత్ విలన్ రోల్ చేస్తున్నారు. ఆగస్టు 15న ఈ మూవీ పాన్ ఇండియా లెవెల్లో విడుదల కానుంది.