BusinessHome Page SliderNationalNews Alert

మహారాష్ట్రకు అమెజాన్, రిలయెన్స్ వరాల జల్లు

మహారాష్ట్రకు భారీ పెట్టుబడుల రూపంలో అమెజాన్, రిలయెన్స్ ఇండస్ట్రీలు వరాల జల్లులు కురిపించాయి. ఇటీవలే ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.3.05 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్రప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఇది రాష్ట్రాభివృద్ధికి ఊతమిచ్చే చారిత్రాత్మక పెట్టుబడి అంటూ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. అయితే రిలయెన్స్ బాటలోనే అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ కూడా మహారాష్ట్రకు భారీ పెట్టుబడులతో ముందుకొచ్చారు. అమెజాన్ క్లౌడ్ కంప్యూటింగ్ విభాగం అమెజాన్ వెబ్ సర్వీసెస్ రూ.71,600 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి నిర్ణయించారు.