“అమరావతి ప్రజా రాజధాని”:సీఎం చంద్రబాబు
ఏపీ సీఎం చంద్రబాబు రాజధాని అమరావతిపై ఇవాళ శ్వేత పత్రం విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సీఎం అమరావతిపై కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా ఏపీ రాజధాని అమరావతి ప్రజా రాజధాని అని సీఎం పేర్కొన్నారు. అమరావతి పునరుద్ధరణ పనులు త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. రాబోయే రోజుల్లో అమరావతి బ్రాండ్ ఇమేజ్ పెంచడంపై ఎక్కువ దృష్టి సారిస్తామని సీఎం వెల్లడించారు. అమరావతి రైతులకు కూడా న్యాయం చేస్తామన్నారు.గత ప్రభుత్వం మా కష్టాన్ని నాశనం చేసిందని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా ఏపీ ప్రజలకు కూడా వైసీపీ ప్రభుత్వం ద్రోహం చేసిందన్నారు. గత ప్రభుత్వ తీరుతో ఇన్వెస్టర్లు కూడా అమరావతిపై నమ్మకం కోల్పోయారన్నారు. కాగా రాష్ట్రంలోని పేదలకు వారి ఊర్లోనే ఇంటి స్థలాలు ఇస్తామని సీఎం హామీ ఇచ్చారు.గత ప్రభుత్వం 5 ఏళ్లలో వ్యవస్థలను పూర్తిగా ధ్వంసం చేశారని సీఎం దుయ్యబట్టారు. భారతదేశ చరిత్రలోనే ఎవరు రాజధానిని మార్చలేదన్నారు.కాగా అలాంటి వారి నుంచి రాష్ట్రాన్ని కాపాడాలని సీఎం పిలుపునిచ్చారు. అయితే నా ఆలోచనలను రాష్ట్ర ప్రజలు కూడా కొన్నిసార్లు అర్థం చేసుకోలేదన్నారు. అందుకే కొన్నిసార్లు వాళ్లకి అర్థమయ్యేలా తాను చెప్పలేక పోయానని సీఎం అసహనం వ్యక్తం చేశారు.