పుష్పకి 14 రోజుల రిమాండ్ – జైలుకి తరలింపు
పుష్ప 2 రిలీజ్ సందర్భంగా హైద్రాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో సినీ హీరో అల్లు అర్జున్‌కి నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఇప్పటికే ఈ కేసులో ఏడుగురుని అరెస్ట్ చేయగా ఇతను ఐదో వ్యక్తి .అయితే ఎఫ్.ఐ.ఆర్ లో బన్నీ పేరుని 11వ వ్యక్తిగా చేర్చారు. మధ్యాహ్నం 12.30గంటలకు చిక్కడ్ పల్లి పోలీసులు అల్లు అర్జున్‌ని అరెస్ట్ చేసి స్టేషన్ కి తరలించారు.అక్కడ నుంచి వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లారు.అనంతరం నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టగా వాదనలు విన్న జడ్జి బన్నీకి 14 రోజుల రిమాండ్ విధించింది.దీనిపై హైకోర్టులో క్వాష్ పిటీషన్ దాఖలు చేశారు.