నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్ పిటీషన్
సంధ్య థియేటర్ ఘటనలో జ్యూడిషియరీ రిమాండ్ శుక్రవారం పూర్తవడంతో సినీ నటుడు అల్లు అర్జున్ నాంపల్లి కోర్టులో బెయిల్ పిటీషన్ దాఖలు చేశారు. రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆయన పిటీషన్ వేశారు. ఇదే కేసులో గత 14 రోజుల కిందట హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. నేటితో రిమాండ్ గడువు ముగియడంతో వర్చువల్‌గా కోర్టుకు హాజరుకానున్నట్లు ఆయన న్యాయవాదులు తెలిపారు.