హాలీవుడ్‌లో అల్లు అర్జున్..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరో ఘనత సాధించారు. పుష్ప చిత్రాలతో అంతర్జాతీయ ఖ్యాతిని సంపాదించిన బన్నీకి హాలీవుడ్ పత్రిక ఫ్రంట్ పేజీలో ఛాన్స్ వచ్చింది. ‘ది హాలీవుడ్ రిపోర్టర్’ అనే సంచిక మొట్ట మొదటిసారిగా ఇండియాలో లాంచ్ కాబోతోంది. ఈ సందర్భంగా తొలి సంచిక అల్లు అర్జున్ ఫోటోతో రానుంది. దీనికోసం కవర్ పేజీ ఫోటో షూట్‌ను నిర్వహించారు. దీనిలో అల్లు అర్జున్ కొన్ని విషయాలు పంచుకున్నారు. తాను ఇండియన్ బాక్సాఫీస్ వద్ద నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నానని, తన జీవితంలో ఇదే పెద్ద అవకాశంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. జీవితంలో సక్సెస్ అయిన తర్వాత కూడా ఎలాంటి గర్వం లేకుండా ఉండడం వ్యక్తిత్వంపై ఆధారపడి ఉంటుందన్నారు. వినయంగా ఉండడం చాలా ముఖ్యమని పేర్కొన్నారు. ‘పుష్ప’ విజయంపై కూడా ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ చిత్రం దేశవిదేశాలలో రికార్డులు సాధించి, సినీ ప్రియులను ఆకర్షించిన సంగతి తెలిసిందే.
