అల్లు అర్జున్ బౌన్సర్ అరెస్ట్
సంధ్య థియేటర్‌లో ‘పుష్ప-2’ చిత్రం ప్రీమియర్ షోలో జరిగిన తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ బౌన్సర్ ఆంటోనిని అరెస్టు చేశారు. ఈ అరెస్టు 2 రోజుల ముందే జరిగినా వెలుగులోకి రాలేదని సమాచారం. నేడు అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీసులు విచారణకు పిలిచారు. ఈ ఘటనలో అనేక ప్రశ్నలు సంధిస్తున్నారు. ఏసీపీ రమేశ్, సీఐ రాజు నాయక్, సెంట్రల్ డీసీపీ ఆకాంక్ష్ యాదవ్ ఆయనను విచారిస్తున్నారు. ఇటీవల ఆయన నిర్వహించిన ప్రెస్‌మీట్‌పై ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ఈ పోలీసు స్టేషన్ నుండి 200 మీటర్ల పరిధిలో పోలీసులు వాహనాల రాకపోకలను నిలిపివేశారు.


