crimeHome Page SliderNational

శిక్ష లేని హ‌త్య‌కు అనుమ‌తించండి

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఎన్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు రోహిణి ఖడ్సే రాసిన లేఖ దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. మహిళలు ఒక హత్య చేయాలని అనుకుంటున్నారని, అలా హత్య చేసిన మహిళలకు శిక్ష పడకుండా ఆదేశాలు జారీ చేయాలని ఆమె లేఖలో పేర్కొన్నారు. అయితే ఆమె హత్య చేస్తానని చెప్పింది మనిషి కాదు. మనిషిలో ఉన్న చెడు ఆలోచనలని. అణచివేత మనస్తత్వం, అత్యాచారం చేయాలనే ఆలోచనను, అస్తవ్యస్తంగా ఉన్న శాంతిభద్రతాలను మహిళలు హత్య చేయాలనుకుంటున్నారని, వారికి శిక్ష పడకుండా చూడాలంటూ ఆమె లేఖలో పేర్కొన్నారు. ఇటీవలె ముంబైలో ఓ 12 ఏళ్ల బాలికపై జరిగిన సామూహిక అత్యాచారాన్ని ఖండిస్తూ రోహిణి ఈ లేఖ రాశారు.మహారాష్ట్రలో శాంతి భద్రతలు అస్తవ్యస్తంగా మారాయని, మహిళలపై రోజు రోజుకు అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని ఆమె విమర్శించారు. మహిళలపై దాడులు చేయాలి, వారిని అణచిపెట్టి ఉంచాలి, వారిపై అత్యాచారం చేయాలనే మనస్తత్వాలను హత్య చేసేందుకు మహిళలకు అవకాశం ఇస్తూ వారికి శిక్ష నుంచి ఇమ్యూనిటీ కల్పించాలని లేఖలో పేర్కొన్నారు.