మరాఠా అసెంబ్లీలో అవినీతి ఆరోపణలు.. ఘర్షణలు
మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు కూడా హాట్ హాట్ గా మారాయి. మహా వికాస్ అఘాడీ కూటమి, బీజేపీ కూటమి ఎమ్మెల్యేల మధ్య ఘర్షణ జరిగింది. షిండే వర్గంపై మహా వికాస్ అఘాడీ కూటమి శాసన సభ్యులు అవినీతి ఆరోపణలు చేయడంతో ఒక్కసారిగా సభ వేడెక్కింది. దీంతో ఇరువర్గాలు పోటాపోటీగా ధర్నాలకు దిగడంతో సభలో తీవ్ర గందరగోళ పరిస్ధితులు ఏర్పడ్డాయి. స్పీకర్ రాహుల్ నార్వేకర్ ఎంతగా నచ్చజెప్పినప్పటికీ ఎవరూ శాంతిచకపోవడంతో సభను పలు పర్యాయాలు వాయిదా వేశారు. అయినా సద్దు మణగలేదు. ఎవరూ తగ్గలేదు. వెనకడుగు వేయలేదు. ఉద్ధవ్ ఠాక్రేకు చెందిన శివసేన శాసన సభ్యులపై ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే వర్గం విమర్శల దాడి చేయడంతో సభ గాడి తప్పింది. ఒకరికొకరు వ్యక్తిగత దూషణలు చేసుకున్నారు. నువ్వెంతంటే నువ్వెంత అనుకున్నారు. రండి చూసుకుందా. సవాళ్ళు విసురుకున్నారు. మాటల యుద్ధంతో సభలో గందరగోళ పరిస్ధితులు ఏర్పడ్డాయి.
