‘ఇకపై యుద్ధాలన్నీ ఇలాగే జరుగుతాయి’..రాజనాథ్ సింగ్..
ప్రస్తుతం జరుగుతున్న సాంప్రదాయ యుద్ధాల స్థానంలో ఇకపై ఆర్థిక, సైబర్ యుద్ధాలే జరుగుతాయన్నారు కేంద్ర రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్. నిరంతరం అభివృద్ధి చెందుతున్న సాంకేతికత భూమి, జల, వాయు మార్గాలలో జరిగే యుద్ధానికి మించి నష్టం కలిగిస్తుందని ఆయన పేర్కొన్నారు. తమిళనాడులోని ఢిఫెన్స్ సర్వీస్ స్టాఫ్ కాలేజీలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన పొరుగున ఉన్న ప్రాంతాల నుండి పరోక్ష యుద్ధం నిరంతరం జరుగుతోందని, ఉగ్రవాద, సైబర్, అంతరిక్ష, సమాచార యుద్ధాలను ఎదుర్కోవడానికి ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.

