Andhra PradeshNewsNews Alert

ఇది ముమ్మాటికీ టీడీపీ వారి పనే.. వైసీపీ ఆరోపణ

కుప్పంలో తప్పంతా టీడీపీదే అని ఆరోపిస్తున్నారు వైసీపీ నేతలు. ఇనుప రాడ్లతో విరుచుకుపడి నానా భీభత్సం సృష్టంచారని .. ఈ దాడిలో ఎంపీపీ అధ్యక్షురాలు అశ్వినితో పాటు మరొకరికి తీవ్ర గాయలయ్యాయని వైసీపీ నేతలు అంటున్నారు. చంద్రబాబు సమక్షంలోనే దాడి జరిగినట్లు గాయపడ్డ వారు చెబుతున్నారు. కొంగనపల్లిలో మొదలైన గొడవలు తీవ్రంగా వ్యాపించి కుప్పంకు చేరాయని.. ఈ ఘర్షణలకు కారణం టీడీపీ కార్యకర్తలేనని వైసీపీ ఆరోపిస్తోంది. అడుగడుగునా తమను రెచ్చగొట్టేందుకే ప్రయత్నించారని అంటున్నారు. టీడీపీ కార్యకర్తలు జరిపిన రాళ్ళ దాడిలో ఓ మహిళతో పాటు ఒక చిన్నారికి కూడా తీవ్ర గాయాలయ్యాయని వైసీపీ నేతలు చెబుతున్నారు. ప్రజల్లో సానుభూతి పొందాలనే టిడిపి ఇలాంటి కుయుక్తితో దాడులకు పాల్పడినట్లు కుప్పం వైసీపీ ఆరోపిస్తున్నారు.