‘కేసులన్నీ కక్షసాధింపు చర్యలే’..అవినాష్ రెడ్డి ఫైర్..
ఏపీలోని కూటమి ప్రభుత్వం కేవలం కక్ష సాధింపు చర్యలతోనే వైసీపీ నేతలపై వరుసగా కేసులు నమోదు చేస్తోందని ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఫైర్ అయ్యారు. తమ పార్టీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని, ఫాల్స్ కంప్లైంట్స్ తీసుకుని, దానికి తగినట్లు కేసు రాసుకుని, సెక్షన్స్ నమోదు చేస్తున్నారని మండిపడ్డారు. తమ పార్టీ కార్యకర్తలు ధైర్యంగా ఉండి ఈ కేసులను ఎదుర్కోవాలని, సమయం వచ్చినప్పుడు శిశుపాలుడి పాపంలా వారి పాపం పండుతుందని ఎద్దేవా చేశారు. కేవలం వైఎస్సార్ విగ్రహానికి కట్టిన టీడీపీ జెండాలను తొలగించినందుకే తమ పార్టీ నేతలపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు పెట్టారని ఆరోపించారు.