Home Page SliderTelangana

 సన్‌రైజర్స్‌ కొత్తకెప్టెన్‌గా ఆల్‌రౌండర్ ‘ఏడెన్ మార్‌క్రమ్’

హైదరాబాద్ సన్‌రైజర్స్‌ జట్టు ఈరోజు ట్విట్టర్ వేదికగా కొత్తకెప్టెన్‌ను ప్రకటించింది. దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ ఏడెన్ మార్క్‌కు జట్టు నాయకత్వ బాద్యతలు అప్పగించారు. ఇంతకు పూర్వం సన్‌రైజర్స్‌కు డేవిడ్ వార్న్, కేన్ విలియమ్స్ కెప్టెన్లుగా పనిచేశారు. వారిద్దరూ జట్టుకు దూరమవడంతో ఇప్పుడు కెప్టెన్ ఎవరనేది ఆసక్తిగా మారిన నేపథ్యంలో మార్‌క్రమ్‌ను కెప్టెన్‌ను చేస్తారని ముందునుంచే ప్రచారం జరిగింది. అతను ఇటీవల దక్షిణాఫ్రికా టీ20 లీగ్ మొదటి సీజన్‌లో సన్ రైజర్స్ ఈస్టర్న్ క్యాప్‌ను గెలుచుకున్నాడు. అంతేకాదు, దక్షిణాఫ్రికాకు ప్రపంచకప్ గెలిచిన ఏకైక కెప్టెన్‌గా నిలిచాడు. 2014లో దక్షిణాఫ్రికా అండర్ 19 ప్రపంచకప్‌ను అతని కెప్టెన్సీలోనే గెలిచింది. ఈ విజయాలను గుర్తించి సన్‌రైజర్స్ ఫ్రాంచైజీ ఐపిఎల్‌లో ఈ బాధ్యతను నిర్వహించడానికి ఐడెన్ మారక్రమ్‌ను ఎంచుకుంది. ఐపీఎల్ చివరి సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున మార్క్ 2022లో 47.63 సగటు కలిగి ఉన్నాడు. 139 స్ట్రైక్ రేట్‌తో 381 పరుగులు చేశాడు.