Breaking NewsHome Page Sliderhome page sliderNewsTelanganaviral

బీసీ రిజర్వేషన్లకు అన్ని పార్టీలు సహకరించాలి

స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లకు అందరూ సహకరించాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌ విజ్ఞప్తి చేశారు. రిజర్వేషన్ల వల్ల ఎవరికీ నష్టం లేదని పేర్కొన్నారు. ‘‘ 50 శాతం రిజర్వేషన్లపై కొందరు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని , దానిలో మార్పులు చేసుకునేందుకు రాజ్యాంగం అవకాశం కల్పించిందని ఆయన తెలిపారు .  42 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు చట్టపరంగా ముందుకెళ్తున్నామని , అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీలు కూడా రిజర్వేషన్లకు మద్దతిచ్చాయని వాళ్ళు అదే మాటపై నిలబడి ప్రభుత్వానికి సహకరించాలని మంత్రి పొన్నం తెలిపారు . అందరి మద్దతుతోనే స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వం ముందుకెళ్తోందని , ఇదే విషయాన్ని న్యాయస్థానంలోనూ ప్రస్తావిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు .