Home Page SliderNational

దీదీ కన్నెర్ర.. 3 మూడు చానెళ్లు బాయ్‌కాట్

వెస్ట్ బెంగాల్ సీఎం మమత బెనర్జీ ఏం చేసినా సంచలనమే. ఆమె తీసుకునే నిర్ణయాలు కూడా వ్యూహాత్మకంగా ఉంటాయ్. రాజకీయంగా రాటు దేలిన ఆమె గత పదేళ్లుగా బీజేపీ దూకుడును నిలువరిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లోనూ సత్తా చాటిన ఆమె తాజాగా మూడు చానెళ్లపై నిషేధం విధించింది. టీవీ చర్చలో తృణమూల్ సీనియర్ నాయకుడు కకోలి ఘోష్ దస్తీదార్, బీజేపీ ఎమ్మెల్యే అగ్నిమిత్ర పాల్ మధ్య వాగ్వాదం జరిగిన కొద్ది రోజుల తర్వాత దీదీ ఈ నిర్ణయం తీసుకున్నారు.కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్, హాస్పిటల్‌లో 31 ఏళ్ల వైద్యురాలిపై అత్యాచారం, హత్య తర్వాత ప్రభుత్వ తీరుపై రేగుతున్న ప్రశ్నలకు తృణముల్ కాంగ్రెస్ దూకుడుగా సమాధానాలిస్తోంది. ఒక్క ఘటన ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టాలని చూస్తే చూస్తూ ఊర్కోమంటూ మండిపడుతోంది.

రాష్ట్రంలోని మూడు ఛానెళ్లు “బెంగాల్ వ్యతిరేక” ప్రచారం చేస్తున్నాయని ఆరోపిస్తూ టివి ఛానల్ చర్చలకు తమ అధికార ప్రతినిధులను పంపకూడదని నిర్ణయించుకున్నట్టు ఆ పార్టీ ప్రకటించింది. “ఏబీపీ ఆనంద, రిపబ్లిక్, TV9 మీడియా ఛానెల్‌లకు వారి నిరంతర బెంగాల్ వ్యతిరేక ఎజెండాతో నడిచే ప్రచారం కారణంగా AITC ప్రస్తుతానికి తమ ప్రతినిధులను పంపకూడదని నిర్ణయించుకుంది. ఢిల్లీలోని జమీందార్‌లను ప్రసన్నం చేసుకోవడానికి వారిపై ఒత్తిడిని మేము అర్థం చేసుకున్నాం. వారి ప్రమోటర్లు, కంపెనీలపై కొనసాగుతున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ కేసులు ఎదుర్కొంటున్నారు. చర్చలు లేదా చర్చల సమయంలో ఈ వేదికలపై పార్టీ మద్దతుదారులు లేదా సానుభూతిపరులుగా చిత్రీకరించబడిన వ్యక్తులు పశ్చిమ బెంగాల్ ప్రజలను తప్పుదారి పట్టించవద్దని మేము స్పష్టం చేస్తున్నాం. అభ్యర్థిస్తున్నాం, ఎందుకంటే వారికి పార్టీ ఎలాంటి అధికారం ఇవ్వలేదు. మా అధికారిక వైఖరికి వారు ప్రాతినిధ్యం వహించజాలరు. బెంగాల్ ప్రజలు ఈ అపవిత్రమైన బంగ్లా బిరోధి నెక్సస్‌ను నిలకడగా తిరస్కరించారు. ఎల్లప్పుడూ ప్రచారానికి బదులుగా సత్యాన్ని ఎంచుకున్నారు” అని పార్టీ X లో పోస్ట్ చేసిన ఒక ప్రకటన విడుదల చేసింది.