Home Page SliderNational

‘ఆల్ హైల్ ది టైగర్’ ఎన్టీఆర్ ‘దేవర’పై కొత్త అప్‌డేట్

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, అందాల తార జాన్వీ కపూర్ నటిస్తున్న కొత్త చిత్రం ‘దేవర’పై అభిమానులకు కొత్త అప్‌డేట్ వచ్చింది. ఈ చిత్రం మరో 100 రోజుల్లో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ ‘ఆల్ హైల్ ది టైగర్’ అంటూ ట్వీట్ చేసింది. త్వరలో కొత్త గ్లింప్స్‌ను విడుదల చేస్తామని, అంతవరకూ వెయిట్ చేయలేకపోతున్నామని, ఈట్వీట్‌లో పేర్కొన్నారు. సక్సెస్ ఫుల్ డైరక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం కోసం ఎప్పటి నుండో అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం తెలుగుతో పాటు కన్నడ, తమిళ, హిందీ, మళయాళ భాషలలో 2024 ఏప్రిల్ 5నాడు విడుదల కాబోతోంది. చిత్రయూనిట్ ఇప్పటికే రిలీజ్ డేట్‌ను ప్రకటించింది.