అందరి చూపు.. నల్గొండ జిల్లా వైపు
నల్గొండ: నల్గొండ జిల్లా రాజకీయం రసవత్తరంగా మారింది. ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు నువ్వా.. నేనా అనే విధంగా పోటీలో ఉన్నారు. ఎవరికి వారుగా విజయమే లక్ష్యంగా ప్రచారంలో మునిగిపోయారు. దీంతో ప్రస్తుతం అందరి దృష్టి నీలగిరిపైనే ఉంది. నల్గొండ కాంగ్రెస్ అభ్యర్థిగా భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రస్తుత ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా మాదగాని శ్రీనివాస్ గౌడ్ బరిలో నిలిచారు. ఈ నెల 18న బీజేపీ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న అమిత్‌షా, 20న ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ తరఫున నల్గొండ ప్రచారంలో పాల్గొననున్నారు.

