ఆర్జీవికి అన్నీ కేసుల్లో ఊరట
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక…టిడిపి,జనసేన పార్టీ నాయకులు ఏపిలో పలు పోలీస్ స్టేషన్లలో చేసిన ఫిర్యాదు మేరకు నమోదైన కేసుల్లో ఆర్జీవికి ఊరట లభించింది.ఈ మేరకు రాంగోపాల్ వర్మకు అన్నీ కేసుల్లో ముందస్తు బెయిల్స్ మంజూరు చేస్తూ ఉత్తర్వులిచ్చింది.గత కొద్ది రోజుల కిందట ఆర్జీవి ఆరెస్ట్ కోసం ఏపి పోలీసులు …హైద్రాబాద్‌లోని ఆయన నివాసం పెద్ద హైడ్రామానే నడిపించారు.ఈ నేపథ్యంలో ఆయన పోలీసులకు చిక్కకుండా హైకోర్టుని ఆశ్రయించారు. అయితే అతను పాయింట్ అవుట్ చేసిన విషయాలన్నింటిని హైకోర్టు పరిగణలోకి తీసుకుని ముందస్తు బెయిల్ ఇష్యూ చేసింది. ఏపిలో మద్దిపాడు, తుళ్లూరు,అనకాపల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో రాంగోపాల్ వర్మపై కేసులు నమోదయ్యాయి. ఏపిసీఎం,డీసిఎం,మంత్రి లోకేష్ ఫోటోలను ఇబ్బందికరంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారనే అంశంపై పై కేసులన్నీ నమోదవగా వాటన్నింటిపైనా కోర్టు బెయిల్స్ ఇష్యూ చేసింది.