ఏపీ ప్రజలకు అలర్ట్
ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ భారీ వర్షాలు పడవచ్చని హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాబోయే 24 గంటలలో కోస్తా ఆంధ్రలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. సముద్రంలో అల్పపీడనం కొనసాగుతున్న కారణంగా మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, నెల్లూరు జిల్లాలకు భారీ వర్షాలు పడవచ్చని పేర్కొన్నారు. ప్రధాన ఓడరేవుల్లో మూడవ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇప్పటికే అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి గుంటూరు జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. దీనితో రైతులు తీవ్రంగా నష్టపోయారు. కోతకు వచ్చిన వరిపంటలు నీటిపాలయ్యాయి. పత్తిపంటకు కూడా భారీ నష్టం వాటిల్లింది. ప్రభుత్వమే ఆదుకోవాలంటూ రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.