Home Page SliderNational

యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న అఖిల్ కొత్త సినిమా ట్రైలర్

అక్కినెని అఖిల్,సాక్షి వైద్య జంటగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన స్పై థ్రిల్లర్  సినిమా “ఏజెంట్”. కాగా ఈ సినిమా ట్రైలర్‌ను చిత్రబృందం తాజాగా యూట్యూబ్‌లో  విడుదల చేసింది.  అయితే ఈ సినిమా ట్రైలర్ విడుదలైన 16 గంటల్లోనే 6.5 మిలియన్ వ్యూస్ సాధించి ఔరా అనిపించింది. దీంతో ప్రస్తుతం ఈ సినిమా ట్రైలర్ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. ఈ సినిమాలో ప్రముఖ మళయాళ హీరో మమ్ముట్టి కీలకపాత్రలో నటించారు. కాగా ఈ సినిమా ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఈ సినిమా ట్రైలర్ బాక్సాఫీసు వద్ద ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో వేచి చూడాల్సివుంది.