మహారాష్ట్ర ఎన్నికలపై అఖిలేష్ యాదవ్ కీలక వ్యాఖ్యలు
మహారాష్ట్రలో ఎన్నికల హడావుడి మొదలయ్యింది. ఈ ఎన్నికలపై సమాజ్ వాది పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర ఎన్నికలు దేశ రాజకీయాలనే మార్చగలవని ఆయన పేర్కొన్నారు. నవంబర్ 20న పోలింగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ సీట్ల పంపకంపై ఆయన మాట్లాడారు. కూటమిలో భాగంగా సమాజ్ వాది పార్టీకి 12 స్థానాలు ఇవ్వాలని కోరినట్లు పేర్కొన్నారు. తమ పార్టీకి బలమున్న స్థానాలను గుర్తించామన్నారు. బీజేపీ పార్టీ రాష్ట్రంలోని పార్టీలను విభజించి, అధికారాన్ని దొంగిలించిందని విమర్శించారు. ఎన్నికల ఫలితాల అనంతరం బీజేపీ ప్రభుత్వం మహారాష్ట్రలో ఉండదన్నారు. అంతేకాదు ఈ ప్రభావంతో డిల్లీలోని కేంద్రప్రభుత్వం, ఉత్తర ప్రదేశ్‌లోని బీజేపీ ప్రభుత్వం కూడా మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదన్నారు. శివసేన, ఎన్సీపీ విభజన అనంతరం జరుగుతున్న ఈ అసెంబ్లీ ఎన్నికలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.

