అజిత్ పవార్‌కు చిక్కిన ఆర్థిక శాఖ
మహారాష్ట్ర కేబినేట్ విస్తరణలో భాగంగా ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్‌కు ఆర్థిక శాఖ దక్కింది. ఎన్సీపీ పార్టీలో తిరుగుబాటు చేసి, ఎన్సీపీ అధ్యక్షుడు, సొంత బాబాయ్ అయిన శరద్ పవార్‌నే ఎదిరించి, మహారాష్ట్ర ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి పదవి దక్కించుకున్న సంగతి తెలిసిందే. తన మద్దతు దారులైన 8 మంది ఎమ్మెల్యేలతో కలిసి అధికార ప్రభుత్వంలో చేరిన అజిత్ పవార్‌కే కాకుండా మిగిలిన వారికి కూడా మంత్రి పదవులు దక్కాయి. అధికార ప్రభుత్వంలో చేరిన రోజే మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వీరికి నేడు శాఖలు కేటాయించారు. వారికి వ్యవసాయం, పౌరసరఫరాలు, మహిళా శిశు సంక్షేమ శాఖ దక్కినట్లు సమాచారం.

