కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శిగా అజయ్ సేథ్
సీనియర్ ఐఏఎస్ అధికారి అజయ్ సేథ్ ని ఆర్థిక శాఖ కార్యదర్శిగా కేంద్రం నియమించింది. సెబీకి ఛైర్మన్ తుహినా కాంత్ పాండే నియమితులు కావడంతో ఆ పోస్టు ఖాళీ అయ్యింది. దీంతో ఆ స్థానంలో అజయ్ సేథ్ ని నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. 1987 బ్యాచ్ కర్ణాటక క్యాడర్ కు చెందిన ఐఏఎస్ అధికారి అయిన సేథ్.. ప్రస్తుతం ఆర్థిక వ్యవహారాలశాఖ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు.ఆర్ధిక శాఖపై మంచి పట్టు ఉండటంతో ఆయన్ను కేంద్రం ఎంపిక చేసుకుంది.కాగా నీతి ఆయోగ్ ని పూర్తిగా ప్రక్షాళన చేసి సమగ్ర సంస్కరణలు ప్రవేశపెట్టేందుకు ఆర్ధిక నిపుణుల కసరత్తు గత కొంత కాలం నుంచి జరుగుతున్న సంగతి తెలిసిందే.


 
							 
							