Home Page SliderInternational

ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడిగా అజయ్ బంగా

ప్రపంచబ్యాంకు నూతన అధ్యక్షుడిగా భారతదేశానికి చెందిన అజయ్ బంగా బుధవారం నియమితులయ్యారు. దీంతో మొట్టమొదటిసారి ప్రపంచబ్యాంకుకు అధ్యక్షత వహించనున్న భారతీయ అమెరికన్‌గా ఆయన నిలిచారు. కాగా ఈ ఏడాది జూన్ 2 నుంచి మరో ఐదేళ్ల పాటు ఆయన అధ్యక్ష పదవిలో కొనసాగుతారని ప్రపంచబ్యాంకు వెల్లడించింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం కొనసాగుతున్న విషయం తెలిసిందే. దీంతో ప్రపంచంలో బాగా అభివృద్ధి చెందిన దేశాలు సైతం కఠిన సవాళ్లు ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో ఎంతో కీలకమైన బాధ్యతలను అజయ్ బంగా చేపట్టనున్నారు. అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలోనే అజయ్ బంగాను ప్రపంచబ్యాంకు అధ్యక్షుడిగా నామినేట్ చేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడన్ ప్రకటించిన చేసిన విషయం తెలిసిందే. కాగా అజయ్ బంగా ఇప్పటివరకు మాస్టర్ కార్డ్, జనరల్ అట్లాంటిక్ వంటి అత్యున్నత హోదాల్లో పనిచేశారు.