ఆస్కార్ మ్యూజియంలో ఐశ్వర్య లెహంగా..
బ్యూటీ క్వీన్‌కి మారుపేరయిన ఐశ్వర్యరాయ్ లెహంగా ప్రపంచం మొత్తం చూసేలా ప్రతిష్టాత్మక ఆస్కార్ మ్యూజియంలో కొలువు దీరింది. ఈ లెహంగాను జోధా అక్బర్ మూవీలో ధరించింది. ఆమె కోసం ప్రఖ్యాత డిజైనర్ నీతా లుల్లా ఈ డ్రస్‌ని డిజైన్ చేశారు. ది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ అకాడమీ మ్యూజియం కలర్ ఇన్ మోషన్ ఎగ్జిబిషన్‌లో దీనిని పెట్టినట్లు ఆస్కార్ అకాడమీ తన అధికారిక ఇన్‌స్టా పోస్ట్ ద్వారా వెల్లడించింది.
లెహంగానే కాకుండా ఆమె ధరించిన ఆభరణాలు కూడా ఈ బొమ్మపై రూపొందించారు. ఈ డ్రెస్ జర్దోజీ ఎంబ్రాయిడరీ, ఆమె ధరించిన నెక్లెస్ మధ్యలో నీలం రాళ్లతో భారతదేశ జాతీయ పక్షి నెమలి ఎట్రాక్షన్‌గా నిలిచింది. జోధా అక్బర్ రాణి ధరించిన లెహంగా, వెండితెరపై ఆకర్షించి, ఇకపై ఆస్కార్ మ్యూజియంలో కొలువు దీరనుంది అని అకాడమీ పేర్కొంది. ఈ చిత్రం కోసం రూ.400 కిలోల నిజమైన బంగారు ఆభరణాలను తయారు చేయించారని, ఐశ్వర్య పాత్ర కోసమే రూ.200 కిలోలు తయారు చేయించారని సమాచారం. దీనికోసం 70 మంది కళాకారులు రెండేళ్లపాటు శ్రమించారు.


 
							 
							