మరోసారి తెరపైకి వచ్చిన ఐశ్వర్య-అభిషేక్ విడాకుల ప్రచారం
బాలీవుడ్ బ్యూటీఫుల్ జంట ఐశ్వర్య రాయ్-అభిషేక్ బచ్చన్‌ల విడాకుల ప్రచారం మరోసారి తెరపైకి వచ్చింది. దీనికి ప్రధాన కారణం నిన్న ఘనంగా జరిగిన అనంత్-రాధిక వివాహ వేడుకలో బచ్చన్ ఫ్యామిలీ అంతా పాల్గొంది. అయితే ఐశ్వర్య రాయ్ తన కూతురు ఆరాధ్యతో కలిసి ఫోటోల దిగారు. కాగా అభిషేక్ తన తండ్రి అమితాబ్,తల్లి జయ,ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు.అయితే అభిషేక్ బచ్చన్-ఐశ్వర్య రాయ్ ఈ విధంగా విడివిడిగా ఫోటోలు దిగడంతో సోషల్ మీడియాలో వీరిద్దరు విడాకులు తీసుకోబోతున్నారనే వార్త మరోసారి చెక్కర్లు కొడుతోంది.