ఎయిరిండియా విమానంకు తప్పిన ప్రమాదం
మస్కట్ ఎయిర్‌పోర్టులో ఎయిరిండియా విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. కొచ్చికి బయలుదేరడానికి రన్‌వే పై సిద్ధంగా ఉన్న విమానం నుండి మంటలు రావడంతో అలర్ట్ అయిన సిబ్బంది వెంటనే ప్రయాణికులను అక్కడి నుండి తరలించారు. ప్రయాణ సమయంలో విమానంలో 141 మంది ప్రయాణికులు , 6 గురు సిబ్బంది ఉన్నట్టు గుర్తించారు. అయితే ఈ ఘటనలో ఎటువంటి ప్రాణపాయం జరుగలేదని , 11 మంది ప్రయాణికులు స్వల్పంగా గాయపడినట్టు సమాచారం. ఎవరికి ఎటువంటి అపాయం జరగకపోవడంతో ఎయిర్ పోర్ట్ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.