News

ఎయిర్ ఇండియాలో ఉక్కపోత

ఢిల్లీ నుంచి పట్నా వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో గాలి లేక ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరయ్యారు. పెద్దవాళ్లతోపాటు చిన్నపిల్లలు కూడా ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్నామని ప్రయాణికులు వాపోయారు. ఏసీ లేకుండా ప్రయాణాలు ఎలా సాగిస్తున్నారని ఫైర్ అవుతున్నారు. ఇలాంటివి ఎయిర్ ఇండియాలో తరచూ జరుగుతున్నాయని, చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ప్రయాణికులు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.