కేదారనాథ్‌లో కూలిన ఎయిమ్స్ హెలికాఫ్టర్
ఉత్తరాఖండ్‌లోని కేదారనాథ్‌లో ఎయిమ్స్ రిషికేశ్‌కు సంబంధించిన హెలికాఫ్టర్ కూలింది. దీనిలో సాంకేతిక సమస్య ఏర్పడిన కారణంగా అత్యవసర ల్యాండింగ్ చేయడంతో వెనుకభాగం దెబ్బతింది. అయితే ఎవ్వరికీ ప్రమాదం జరగలేదు. ఇది ఎయిర్ అంబులెన్స్‌గా తెలుస్తోంది. దీనిలో పైలట్, డాక్టర్, పారామెడికల్ స్టాఫ్ సురక్షితంగానే బయటపడ్డారని సమాచారం. అత్యవసర సేవల కోసం ఈ హెలికాఫ్టర్‌ను వాడతారు. కేదార్ నాథ్‌లోని ఒక రోగి ఎమర్జెన్సీ సేవల కోసం వెళ్లిన హెలి అంబులెన్స్ ల్యాండింగ్ సమయంలో సాంకేతిక లోపానికి గురయ్యింది. ఈ ఘటన జరిగిన సంగతి తెలుసుకున్న స్థానికులు, పోలీసులు, రెస్క్యూ బృందాలు వెంటనే అక్కడికి చేరుకున్నాయి.