NationalNews Alert

హవ్వ… ఇళ్ల మధ్యలో బార్, రెస్టారెంట్లా..! వైసీపీ ఎమ్మెల్యేకు ఝలక్

ఇళ్ల మధ్యన ఉన్న వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు చెందిన రెస్టారెంట్ , బార్‌లను తొలగించాలని కోరుతూ విజయవాడలోని అజిత్‌సింగ్ నగర్‌లో ఐద్వా ఆధ్వర్యంలో ఆందోళన కార్యాక్రమం నిర్వహించారు. విజయవాడలో మహిళా సంఘాల ఆందోళన ఉద్రిక్తంగా మారింది. రెస్టారెంట్, బార్‌ను తొలగించాలని ఐద్వా కార్యకర్తలు ఆందోళనకు దిగడంతో రంగ ప్రవేశం చేసిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఆందోళనకు దిగిన మహిళలను ఈడ్చుకుంటూ ఆటోల్లో ఎక్కించారు. దీంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల వైఖరిని నిరసనలో పాల్గొన్న మహిళలు ఖండించారు. పోలీసుల ముసుగులో మద్యం దుకాణం నిర్వాహించడం సిగ్గుచేటు అని ఐద్వా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల ప్రవర్తనపై మహిళ సంఘాలు మండిపడ్డాయి. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న బార్, రెస్టారెంట్ తొలగించాల్సింది పోయి, మద్దతుగా నిలుస్తారా అంటూ పోలీసులపై ఐద్వా నేతలు నిప్పులు చెరిగారు.