మోకాలికి ఆర్డిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) కవచం
ఆర్డిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఇప్పుడు అన్నీ రంగాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. గతంలో మాన్యువల్ ప్రాసెస్ ని మెషీనిజమ్ భర్తీ చేసింది.ఆ మెషినిజాన్ని ఇప్పుడ కంప్యూటర్లు భర్తీ చేస్తున్నాయి.ఆ కంప్యూటర్ల ఆపరేటింగ్ సిస్టంలోనూ ఇప్పుడు వరల్డ్ ట్రెండీగా ఏఐ ఆవిష్కృతమైంది.ప్రస్తుతం నడుస్తున్న ప్రపంచమంతా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వైపు పరుగులు తీస్తుందనడానికి ఓ ఘటన ఉదాహరణగా మారింది. లండన్‌కి చెందిన హప్పోస్ అనే స్టార్టప్ ఏఐ సంస్థ మొట్టమొదటి సారిగా మనిషి మోచిప్ప కు రక్షణ కవచంగా ఉండే ఏఐని రూపొందించింది. ఒక మనిషి ప్రమాదవశాత్తు కిందపడితే 60 మిల్లీ సెకన్లలోపే గాయం అవుతుంది.అలా గాయం అవకుండా ఉండేలా ఏఐ ద్వారా ..సేమ్ టు సేమ్ వెహికల్ యాక్సిడెంట్ కార్ బెలూన్స్ ఎలా ఓపెన్ అవుతాయో అలా ఓపెన్ అయ్యేలా రూపొందించారు.అంటే 30 మిల్లీ సెకన్లలోపే ఈ నీ ఎయిర్ బెలూన్ ఓపెన్ అయ్యి గాయాలను నివారిస్తుందన్న మాట. దీన్ని లాంఛనంగా ఆదివారం లండన్ లోని ఓ ఫుట్ బాల్ క్లబ్ లో ఆడుతున్న ప్లేయర్లకు అమర్చడం ద్వారా ప్రవేశపెట్టారు.మొత్తం మీద ఆర్డిఫీషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎంత ఫాస్ట్‌గా ఈ ప్రపంచ అవసరాలపై ముద్ర వేస్తుదో అర్ధం చేసుకోవచ్చు.

