వ్యవసాయ బడ్జెట్.. 64 వేల కోట్లు?
హైదరాబాద్: రైతు సంక్షేమ పథకాలకు 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.64 వేల కోట్ల నిధులు అవసరమవుతాయని వ్యవసాయ శాఖ ప్రతిపాదనలు తయారు చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేయబోతున్న రుణమాఫీ పథకానికి రూ.31 వేల కోట్లు, రైతు భరోసాకు రూ.23 వేల కోట్లు, ఉచిత పంటల బీమా పథకానికి రూ.3 వేల కోట్లు, రైతుల బీమాకు రూ.1,500 కోట్ల నిధులు అవసరమవుతాయని అధికారులు అంచనా వేసినట్లు సమాచారం.