వీఐపీ దర్శనం ఇప్పిస్తామని భక్తులకు కుచ్చుటోపీ..
తిరుమల శ్రీవారి వీఐపీ దర్శనం దొరుకుతుందంటే భక్తులు ఎంతైనా ఇవ్వడానికి సిద్ధపడతారు. వారి బలహీనతను క్యాష్ చేసుకున్నారు దళారులు. స్వామివారి దర్శనానికి వీఐపీ టిక్కెట్ ఇప్పిస్తామని చెప్పి పుణె భక్తుడు ప్రకాశ్ అనే వ్యక్తి నుండి రూ.70 వేలు వసూలు చేశారు. అయితే వారికి వీఐపీ దర్శనం ఇప్పించలేదు. దానికి బదులుగా రూ.300 ప్రత్యేక దర్శనానికి పంపి, వారి డబ్బు శ్రీవాణి ట్రస్టుకు కట్టామని అబద్దాలు చెప్పారు. దీనితో మోసపోయినట్లు తెలుసుకున్న ప్రకాశ్ టీటీడీ విజిలెన్స్‌కు ఫిర్యాదు చేశారు. ఈ దళారులపై తిరుమల ఒకటో పట్టణ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.