Home Page SliderInternational

సెంచరీ కొట్టాక , పుష్ప స్టైల్లో డేవిడ్ వార్నర్

నేడు జరుగుతున్న ఆస్ట్రేలియా, పాకిస్తాన్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ చెలరేగి ఆడారు. సెంచరీ చేసిన డేవిడ్ వార్నర్ అనంతరం పుష్ప చిత్రంలో  తన అభిమాన హీరో అల్లుఅర్జున్ స్టైల్లో తగ్గేదే లేదంటూ ఫోజిచ్చారు.  తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 47 వ ఓవర్ వద్ద ఆరు వికెట్లు కోల్పోయి, 354 పరుగుల వద్ద ఆడుతోంది. చివరికి 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 367 పరుగులు చేసింది. 368 పరుగుల భారీస్కోరును పాక్ ముందు ఉంచింది. ఈ వరల్డ్ కప్‌లో వార్నర్ ఇంకా పుంజుకోలేదంటూ క్రికెట్ అభిమానులు చేసిన ట్రోల్స్‌కు తనదైన స్టైల్లో సమాధానం చెప్పారు. పాక్ బౌలర్లకు అందకుండా చుక్కలు చూపించారు. సెంచరీ పూర్తి చేశారు. 164 పరుగులు సాధించారు. దీనితో అల్లు అర్జున్ అభిమానులు, డేవిడ్ వార్నర్ అభిమానులు ఈ ఫొటోలను వీడియోలను షేర్ చేస్తున్నారు.