విజేత విషయంలో ఆఫ్రిది ఊహించని ట్విట్టర్ ట్విస్ట్
ఇండియా , పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే మరే మ్యాచ్‌కి లేని ఉత్కంఠ పెరుగుతుంది. మ్యాచ్ అడేది క్రికెటర్సే అయిన రెండు దేశాల మద్య యుద్ధం జరుగుతుందేమో అన్న వాతావరణం నెలకొంటుంది. వీరి మ్యాచ్ కోసం ఎంతోమంది క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తూ ఉంటారు. మరి ఇంతటి ఉత్కంఠ భరితమైన మ్యాచ్ దగ్గర పడుతుండడంతో గెలుపు ఎవరిది అనే అంశంపై చర్చ జరగడం సహజమే.. ఈ క్రమంలోనే పాకిస్తాన్ మాజీ ఆల్‌రౌండర్ షాహిద్ ఆఫ్రిదిని గెలుపు ఎవరిదని అడుగగా, ఊహించని సమాధానంతో అందరిని ఆశ్చర్యపరిచాడు.

ట్విట్టర్ వేదికగా షాహిద్ ఆఫ్రిదిని కొంతమంది అభిమానులు “ పాకిస్తాన్ , భారత్ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారనుకుంటున్నారని ” ప్రశ్నించారు. సాధారణంగా ఎవరైనా సరే భారత్‌ను అభిమానించే వారైతే భారత్ అనీ , పాకిస్తాన్‌ను అభిమానించే వారైతే పాకిస్తాన్ అని సమాధానమిస్తారు. కానీ షాహిద్ మాత్రం ఎవ్వరు ఊహిచని విధంగా ఎవరు తక్కువ తప్పులు చేస్తే వాళ్లే మ్యాచ్‌లో విజయం సాధిస్తారని సమాధానం ఇచ్చారు. అతని నుండి ఈ సమాధానం అభిమానులు ఊహించలేదు. ఎప్పుడూ టీమిండియాపై విమర్మలు చేసే అఫ్రిది నుండి ఈ విధమైన ట్విస్ట్ ఎవరు ఊహించి ఉండరు కదా..

