News Alert

రాష్ట్రమంతా దత్తత తీసుకోండి కేటీఆర్

తెలంగాణలోని మునుగోడు ఉప ఎన్నికకు టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి నిన్న నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఇందులో తెలంగాణ మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ… మునుగోడు ప్రజలు కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపిస్తే.. మునుగోడు నియోజకవర్గాన్ని దత్తత తీసుకొంటానని ప్రతి మూడు నెలలకొకసారి రివ్యూ మీటింగ్ పెట్టి అభివృద్ధిపై చర్చిస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. మునుగోడును సిరిసిల్లలా చేస్తానని హామి ఇచ్చారు. దీంతో కేటీఆర్‌పై నెటిజన్లు మండిపడుతూ..మీరు సిరిసిల్లకు మాత్రమే మంత్రి కాదని, రాష్ట్రం మొత్తానికి అని ఫైర్ అవుతున్నారు. అన్ని ప్రాంతాలను ఒకే విధంగా చూడాలని కోరుతున్నారు.