Home Page SliderTelangana

ప్రజావాణి వాయిదా

హైదరాబాద్ మహాత్మా బాపు రావు పూలే ప్రజా భవన్ లో జరిగే ప్రజావాణి కార్యక్రమం బుధవారానికి వాయిదా వేయడం జరిగిందని ప్రజావాణి నోడల్ అధికారి దివ్య తెలిపారు.  ప్రజాభవన్ లో 16వ ఆర్థిక సంఘం సమావేశాలు జరుగుతున్నందున మంగళవారం నాడు నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమం బుధవారానికి వాయిదా వేసినట్టు ఆమె తెలిపారు. ఈ మార్పును అనుసరించి అర్జీదారులు బుధవారం నాడు ప్రజావాణి కార్యక్రమానికి హాజరుకావాలని దివ్య ఒక ప్రకటనలో తెలిపారు.