అద్దంకి సిద్ధమంతా గ్రాఫిక్స్‌తో జగన్ యుద్ధం: ట్విట్టర్‌లో నారా లోకేష్ ఎద్దేవా!
అద్దంకి మేదరమెట్ల వద్ద వైసీపీ నిర్వహించిన సిద్ధం సభ అంతా గ్రాఫిక్స్ మయమని తేల్చేశారు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ఒక గుంపును అనేక చోట్ల అమర్చి ఆ ఫోటోలను విడుదల చేశారని ఇవన్నీ కూడా మార్ఫింగ్ ఫోటోలని ఎద్దేవా చేశారు. చరిత్రలో ఎన్నడైనా… ఇలాంటి పరిస్థితి ఉందా అంటూ ఆయన ప్రశ్నించారు. స్టేడియం చుట్టూ గ్రీన్ మ్యాచ్ ఏర్పాటు చేసి వేదిక జుట్టు గ్రీన్ మ్యాట్‌తో… డ్రోన్ చిత్రాలంటూ ఏకంగా ఇప్పుడు మార్ఫింగ్ ఫోటోలను రిలీజ్ చేశారని మండిపడ్డారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అసలు ప్రజల నుంచి మద్దతు లేదని… ఆయనను ప్రజలు ఎన్నికల్లో ఓడించడం ఖాయమని లోకేష్ విమర్శించారు.