రోడ్డు ప్రమాదంలో అడిషనల్ డీసీపీ మృతి
హైదరాబాద్ హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. లక్ష్మా రెడ్డి పాలెం జాతీయ రహదారిపై వాకింగ్ వెళ్ళడానికి రోడ్డు దాటుతుండగా అడిషనల్ డీసీపీ బాబ్జీని APSRTC బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో అక్కడికక్కడే బాబ్జీ మృతి చెందారు. తెలంగాణ డీజీపీ ఆఫీసులో అడిషనల్ డీసీపీ బాబ్జీ విధులు నిర్వర్తిస్తున్నారు. మూడు రోజుల క్రితం బాబ్జీకి అడిషనల్ ఎస్పీగా ప్రమోషన్ వచ్చింది. ఇంకో మూడు రోజుల్లో డీజీపీ ఆఫీస్ లో రిపోర్టు చేయాల్సి ఉండగా ఇంతలోనే ప్రమాదం జరిగింది. దీంతో బాబ్జీ కుటుంబంలో విషాద ఛాయాలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

